Saturday, February 24, 2007

సంపూర్ణ సుందర కాండ 11వ సర్గ

అంతట హనుమ కొంతాలోచించి
వచ్చిన తలపును ప్రక్కకు నెట్టి
సావకాశముగ చింతన చేసి
సీత విషయమై ఈ విధి తలచే 1

రాముని వీడీన సీతా సాధ్వి
ఇట్టి సుఖ మగు నిద్రను తీయదు
ఆకలి దప్పులు మరచి ఉండును
ఆభరణాదులు విడిచి ఉండును 2

దేవులైనను, ఇంద్రుడైనను, రాముని
వీడి, పర పురుషుని చేరదు
ఈమె మరి ఎవరో కాని సీత కానేరదని
తలచుచు హనుమ ముందుకు సాగెను 3

రతి క్రీడలో అలసిన కొందరు
మధుర గానమున డస్సిన కొందరు
నృత్య రీతులతొ మగ్నమై కొందరు
తాగిన తప్పతో తూలిన కొందరు 4

తిన్నెల పైన కూలిన కొందరు
చిన్నెల పైన తూలిన కొందరు
మృదంగముల పై వాలిన కొందరు
తివాచీల పై సోలిన కొందరు 5

నగల అందముల కీర్తనలొనూ
అందము గూర్చిన చర్చలలొనూ
పాటల అర్ధపు తర్కములొనూ
సందర్భోచిత భాషణలొనూ 6

రాజోచితమగు ప్రవర్తనతొనూ
సమయోచితమగు నిశ్శబ్దతతొనూ
వివిధ రీతులతొ మెలిగెడి ఇంతుల
గుంపులు చూచెను మారుతి వరుసగ 7

చేరిన ఆవుల మందల నడుమ
బలమగు వృషభము నిలచిన రీతిన
ఇందరు సుందర యువతుల నడుమ
రావణుడుండుట హనుమ చూచెను 8

ఒక సుందర వనమున అటకు చేరిన
ఆడ ఏనుగుల మందకు తోడుగ
మత్తగజ మొకటి చేరిన తీరుగ
రావణుడుండుట హనుమ చూచెను 9

రావణ గృహమున అటు నిటు తిరుగుతు
ఒక్కటి వదలక గది గది వెదుకుతు
వివిధ మదిరలతొ నిడినదైన పాలశాను
ఒకటి అచ్చెరువందుచు హనుమ చూసెను 10

అందున్న వివిధ వస్తువులు చూచుచు
విస్మయమొందుచు, అచ్చెరువందుచు
మంచి పాత్రలలొ వింతగ అమరిన
జింక, దున్న, పందుల మాంసము చూసెను 11



రక్కసులు రుచి మరిగి సగమారగించిన
చక్కగ వండిన నెమలి మాంసము
సుగంధ ద్రవ్యములు మెండుగ దట్టించి
వండి, తినగా మిగిలిన కోడి మాంసము 12

పందులు, మెకలు, గొర్రెలు, నెమళ్ళు
కోళ్ళు, ముళ్ళపందుల మేలు మాంసము
పెరుగు, ఉప్పుల పూతల నానబెట్టిన
మేటి ఊరు పచ్చడులను హనుమ గాంచెను 13

మంచిగ వండిన క్రకర పక్షులు
అడవి దున్నలు, ఎకస్లేయ మను చేపలు
మేకలు, తినగా మిగిలిన చకోర పక్షులు
వివిధ మధువులను హనుమ చూసెను 1415

ఉప్పు కారములు తగురీతి జల్లిన
రగములు శదభముల చేతను
మంచి విలువలు గలిగియు విసరబడిన
గొలుసులు, కంకణముల చేతను 16

వివిధ ఫలముల సారము నిండిన
బంగరు పాత్రల మెరుపుల చేతను
సుగంధము విసిరెడి, పుప్పొడి నిండిన
సుందరమగు పుష్పముల చేతను 17

గణ గణ మండుచు నిప్పులు చెరగుచు
వెచ్చటి గాలులు గదిలో నింపెడి మంటల చేతను
సరిగా అమరిన, బంగరు కాంతుల
సోభల వెలిగెడి సోపానముల చేతను 18

వింత అమరికలతో కంటికి ఇంపుగ
మంచి దినుసులుగల వంతల చేతను
వివిధ మాంసములు విడిగా కలవక
విడివిడిగా పేర్చిన అమరిక చేతను 19


చెరుకు గడలతో, పట్టుల తేనెతో
పువ్వుల మకరందముతో, పండ్ల రసముతో
వివిధ అత్తరులతో, మంచిగ మధురముగ
చేయబడిన సురలతో నిండిన భవనమది 20

చెదిరిన పూల దండలతో, వాడిన పూలతో
స్ఫటిక పాత్రలతో, బంగరు కుండలతో
దొంతరలుగా పేర్చ బడిన కుంభములతో
వింత కాంతులతో సోభిల్లు చుండెనా భవనము 2122

కాంచన కాంతులీను పాత్రలతో
మణులు నిందిన కలశములతో
మధువు నిందిన కుంభములతో
మెరిసెడి శాలను హనుమ చూసెను 2324

మితముగా మధువు గ్రోలెడి వారు
అతిగా త్రాగి సోలిన వారు
కిక్కిరిసి వున్న కొన్ని గదులు
కొన్ని గదులలో జనమే లేరు 25

కొన్ని గదులలో తిను బండారాలు
కొన్ని గదులలో త్రాగెడి జలములు
కొన్ని గదులలో వందిన వంటలు
కొన్ని గదులలో వండెడి గిన్నెలు 26

కొన్ని గదులలో విరిగిన పాత్రలు
కొన్ని గదులలో నిందిన ఘటములు
కొన్ని గదులలో పూల మాలికలు
కొన్ని గదులలో పండ్ల రసములు 27

సెయ్యల పైన సోలిన యువతులు
చెలియల ఒడిలో ఒదిగిన యువతులు
నిద్రలొ ముణిగిన అతి సుందరులు
మగత నిద్రలో వేరొక యువతుల 28
వస్త్రములు లాగుచు తమపై కప్పుచు
చేతులు కాళ్ళు బారగ చాపుచు
అస్తవ్యస్తముగ, చిందర వందరగ
వివిధ భంగులలొ సోలిన యువతులు 29
నిద్రలొ ఉవిదల నిట్టూర్పులతో
కట్టిన వలువలు వేస్న దండలు
యెదపై గొలుసులు, కర్ణాభరణములు
ఎగురు చుండెను రాక్షస ధ్వజము వలే 30


గంధ లేపనముల మేటి వాసనలు
మంచి అత్తరుల మధుల్ర గంధములు
తీపి మధువుల మత్తు సౌరభములు
కలిసి గాలులు వీచె నచ్చట 31

వికసించిన పువ్వుల గంధము
స్నానశాలనుండి కరిగిన గంధపు వాసన
చల్లని పిల్ల గాలులకి తొడై
అతి మధురంగా, పుష్పకమును వ్యాపించె 32

బంగరు మేని చాయల తేలు యువతులు
తెల్లని స్పటిక వర్నము కల జాణలు
నల్లని మేని చాయతో మెరిసెడి ఇంతులు
రావణ మందిరమ్మున సంచరించు చుండె 33

రతిక్రీడలొ అలసిన స్త్రీలు
నిద్రా దేవత ఒడిలో చేరిన వారు
నిద్రించెడి పద్మములవలే
సీతకై వెదికెడి హనుమకు తోచెను 34


అన్ని తావులు తిరిగి చూసెను
ఒక్క గదియు వదలడాయెను
భవన మంతయు కలియ తిరిగెను
సీత జాడ మరి దొరక దాయెను 35

పర స్త్రీలను చూసినందుకు
వారి గృహములను వెదికి నందుకు
ధర్మ మీరీతి తప్పి నందుకు
హనుమ కొంచెము సంశయించెను 36

"రాస క్రీడలొ మునిగి వున్న
పరుల పడతులను చూసి వుంటిని
అనుమతి లేక ఇతరుల ఇంటను తిరిగి వుంటిని
ధర్మము నేను తప్పి వుంటినా? 37

వారి ఇండ్లలో తిరిగి వున్నను
పరుల స్త్రీలను చూసి వున్నను
ఇండ్లలో చొచ్చి తిరుగుట, పరుల స్త్రీలను
పొంచి చూచుట, నా ధ్యేయము కాదు" 38

హనుమ వీరుడు బుద్ధి కుశలుడు
మనసు స్థిమితము చేసి అప్పుడు
చేయు పని పై దృస్ఠి నిలిపగ
ఈవిధముగ తిరిగి ఆలోచించెను 39

"రావణ భార్యలను నిజమె చూసితి
అతని ఇంటను నేను చొచ్చితి
నా కన్నులేమి చూసినప్పటికి,
మనసు మాత్రము సీతనెదికె 40

చేయు పనిలో మంచి చెడ్డలు
నిర్ణయించునది మనసు ఒక్కటె
మనసు పైన పట్టు వుంటే
మంచి తక్క వేరొకటి చేయ జాలము 41

మూల మూలలు ఇంటతిరగక
ఉన్న గదులలో తేరి చూడక
మాత జాడకై వెదక గలుగుట
నాకు మాత్రము సాధ్యమగున? 42

ఒక జాతి జీవిన వెదక వలెనన్న
ఆ జాతి గుంపులొ చూడ వలెను
ఒక ఇంతి కొరకై వెదక చూసిన
జింక గుంపులో వెదక తగునా? 43

అందువలననే అసుర భవనమున
ఇంతమంది స్త్రీల నడుమన
సీత కొరకై వెదికి చూసితి
మాత దొరక చింత నుంటిని" 44

దేవ కన్యలు చూసి వుండెను
గంధర్వ కాంతలను గాంచి వుండెను
నాగ యువతులను చూసి వుండెను
సీత మాత్రము దొరక దాయెను 45

సీత గానక, అసృనయనుడై
మనసు చెదిరిన వీర హనుమ
కొంత దూరము వెళ్ళి నిలచెను
దుఖముతో మనసు భార మవ్వగ 46

తిరిగి బలమును కూడగట్టుకుని
చెదిరిన మనసును ప్రక్కకు నెట్టి
ముందు కార్యమును యెదలో నింపి
సీత కొరకై వెదక మొదలిడె 47

No comments: